ఈ నెల 29 నుంచి తిరిగి కురిసే వర్షాలు
తెలంగాణలో చలి తీవ్రత మళ్లీ పెరుగుతోంది. రాష్ట్రంలో చలిలో “పులి” మళ్లీ పంజా విసురుతున్నట్లుంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకు తగ్గుతూ, సాయంత్రం 5–6 గంటల తర్వాత రాష్ట్రంలో ప్రజలు చలితో గజగజ వణికిపోతున్న పరిస్థితి నెలకొంది. ఉదయం 9 గంటలకైనా చలి ప్రభావం కొనసాగుతూనే ఉంది. పల్లెలు, పట్టణాలు రెండూ చలి తీవ్రతను ఒకే రీతిలో అనుభవిస్తున్నాయి.ఈ నేపథ్యంలో, భారత వాతావరణ శాఖ (IMD) తెలంగాణలో వర్షాల అవకాశంపై హెచ్చరిక జారీ చేసింది. ఈ నెల 29 నుంచి వర్షాలు పడే అవకాశం ఉంది. అంతేకాక, ఈనెల 30 న కొన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని సంబంధిత జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేయబడ్డాయి.ప్రస్తుతం చలి తీవ్రత కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయంత్రం అయితే బయటకు రావడం కష్టంగా మారింది. ఉదయం 9 గంటలకు కూడా చలి ఇంకా ఎక్కువగా ఉంది. వాతావరణ శాఖ ప్రకారం రాబోయే రెండు రోజులలో చలి మరింత పెరగబోతోంది.ఇక వాతావరణ అంచనాల ప్రకారం, నైరుతి బంగాళాఖాతంలో ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో ఏర్పడిన తుపాను ఉత్తర-వాయువ్య దిశలో కదులుతూ, రాబోయే 12 గంటల్లో బలపడే అవకాశం ఉంది. ఈ తుపానా ప్రభావంతో తెలంగాణలో 29, 30 తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలు కురిసినప్పటికీ చలి తీవ్రత తగ్గే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. నవంబర్ 30 నుండి డిసెంబర్ 1 వరకు పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.ఈ మేరకు భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు ఐఎండీ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు, చలి కారణంగా చిన్నారులు, వృద్ధులు, రోగులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
