వెలుగుమట్ల భూదాన్ బాధితులకు ఊరట – 412 మందికి పట్టాలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
ఖమ్మం:
వెలుగుమట్ల భూదాన్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. సిటీలోని భూదాన్ భూముల్లో ఇళ్లను కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం ఇళ్లు నిర్ణయించింది. ఆ శాఖ ఆధ్వర్యంలో మొత్తం 412 మందికి పట్టాలు ఇవ్వడానికి అధికారులు మంగళవారం (మార్చి 10) ఏర్పాటు చేశారు.
భూదాన్ బాధితుల్లో ఇళ్ల స్థలాలు లేని 311 మందికి స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. మరో 101 మందికి వారి సొంత గ్రామాల్లో ఇప్పటికే అధికారులు పేర్కొన్నారు. వీరికి తమ సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నారు.
ఈ ప్రక్రియలో భాగంగా మంగళవారం (మార్చి 10) ఖమ్మం కలెక్టరేట్లో ఆ శాఖ ఆధ్వర్యంలో భూదాన్ బాధితులకు టోకెన్లు పంపిణీ చేశారు. టోకెన్లు పొందిన బాధితులకు బుధవారం (మార్చి 11) జిల్లా మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి చేతుల మీదుగా పట్టాలు అందజేయనున్నారు.
టోకెన్లు అందుకున్న భూదాన్ బాధితులు తమ సమస్యకు పరిష్కారం చూపినందుకు ప్రభుత్వానికి, జిల్లా మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.
