Rohit Sharma: వన్డేల్లో అత్యధిక సిక్స్ల వీరుడిగా రోహిత్ శర్మ
ఇంటర్నెట్ డెస్క్ టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ వన్డేల్లో అత్యధిక సిక్స్ ల వీరుడిగా నిలిచాడు. రాంచిలో దక్షిణాఫ్రికా, టీమ్ ఇండియా మధ్య జరుగుతున్న తొలి మ్యాచ్ దీనికి వేదికైంది. ప్రేనెలన్ సుబ్రాయెన్ బౌలింగ్లో (14.1, 14.2) రోహిత్ రెండు వరుస సిక్స్ లు బాదాడు. ఈ మ్యాచ్ ముందు వరకు రోహిత్ శర్మ ఖాతాలో వన్డేల్లో 349 సిక్స్లున్నాయి. ప్రెనెలన్ సుబ్రాయెన్ బౌలింగ్లో వచ్చిన రెండు వరుస సిక్స్ లతో రోహిత్ శర్మ. పాకిస్థాన్ బ్యాటర్ షాహిద్ అఫ్రిది పేరిట ఉన్న అత్యధిక సిక్స్లో (351) రికార్డు సమం చేశాడు. అనంతరం మార్కో యాన్సన్ బౌలింగ్లో (19:4). బౌలింగ్లో అతడు అద్భుతమైన సిక్స్ బాదాడు. దీంతో హిట్మ్యాన్ వన్డేల్లో అత్యధిక సిక్స్ ల (352) వీరుడిగా నిలిచాడు. షహిద్దఫ్రిదీ, క్రిస్ల్, సనత్ జయసూర్య, ఎంఎస్ ధోనీ వంటి హేమా హేమీలను వెనక్కి నెట్టి ఈ జాబితాలో అగ్రస్థానానికి చేరాడు.
ఆ షాట్ రోహిత్ వజ్రాయుధం..!
సచిన్ ఆన్ డ్రైవ్, విరాట్ ఎక్స్ట్రా కవర్ డ్రైవ్, లక్ష్మణ్ ఫ్లిక్, ధోని హెలికాప్టర్ షాట్లను చాలా కళాత్మకంగా అడగలరు. కానీ, రోహిత్ అమ్ములో పొదిలో ఓ పవర్ ప్యార్డ్ షాట్ ఉంది. అదే అతడిని హిట్ మ్యాన్ చేసింది. అతడి షాట్లలో వజ్రాయుధం లాంటిది. మిగిలిన బ్యాటర్లను ప్రత్యర్థి బౌలర్లు బౌన్సర్లు, షార్ట్్పచ్ బాల్సేతో భయపెడతారు కానీ, రోహిత్కు ఎట్టి పరిస్థితుల్లో ఆ బంతులు వేయడానికి యత్నించరు. ఎందుకంటే అతడు తన ఫేవరెట్ షాట్ను ప్రయోగిస్తే బౌలర్ల గణాంకాలు గల్లంతు కావాల్సిందే. రోహిత్ అమ్ములపొదిలోని ఆ శక్తిమంతమైన ఆయుధం పేరు ఫుల్ షాట్. సమకాలీన వన్డే క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరూ ఈ ఒక్కపాట్తో బాదనన్ని సిక్చర్లను రోహిత్ కొట్టాడు.
ఈ ఎస్పీన్ గణాంకాల ప్రకారం 2015-2020 మార్చి వరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 570 ఫుల్ షాట్లు వాడి రోహిత్ 116 సిక్సర్లను మలిచాడు.. !ఆ తర్వాత స్థానంలో ఉన్న ఇయాన్ మోర్గాన్ 294 ఫుల్ షాట్లు ఆడి కేవలం 47 మాత్రమే సిక్సర్లు మార్చగలిగాడంటే రోహిత్ ఏ స్థాయిలో ఈ పాటను ఆడాడో అర్ధం చేసుకోవచ్చు. క్రికెట్ డాట్ కామ్ ప్రకారం 2010 నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు ఈ షాట్తో వన్డేల్లో రోహిత్ కొట్టిన సిక్సర్ల సంఖ్య 127. ఒక్క వన్డేల్లోనే రోహిత్ చేసిన పరుగుల్లో దాదాపు 19 శాతానికిపై దీని నుంచి రాబట్టినవే.
కలిపొచ్చిన అద్భుతమైన టైమింగ్..
రోహిత్ ప్రతిస్పందన వేగం మిగిలిన బ్యాటర్లతో పోలిస్తే చాలా వేగంగా ఉంటుంది. దీంతో అతడికి “ఎక్స్ట్రా సెకండ్’ ఉంటుందని కామెంటేటర్లు తరచూ చెబుతుంటారు. దీంతో అతడు బంతిని, డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా బౌండరీని దాటించేస్తాడు. కింగ్ కోహ్ల్ని సైతం ఈ షాట్ ఆడటానికి కొంత అసౌకర్యంగా ఫీలవుతాడు.. అలాంటిది రోహిత్ మాత్రం అలవోకగా ఆడేస్తాడు.
