రూ. 2.51 కోట్లు హాంఫట్.. ఎందుకో తెలుసా?
హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన ఇద్దరు యువ వైద్యులు సైబర్ మోసగాళ్ల వలలో పడి భారీగా రూ.2.51 కోట్లు కోల్పోయారు. స్టాక్ మార్కెట్లో అధిక లాభాలు వస్తాయన్న నమ్మకంతో క్యూఆర్ కోడ్ ద్వారా పెట్టుబడి పేరుతో పంపిన డబ్బు తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి ఈ నెల 3న పరకాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగదు పెద్దమొత్తంలో ఉండటంతో నేషనల్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కూడా ఈ ఘటనపై విచారణ ప్రారంభించింది.
