Rythu Bharosa : వారికి రైతు భరోసా కట్!, రైతులకు ఊహించని షాక్.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందించే రైతు భరోసా పథకంలో మార్పులు చేసింది. యాసంగి సీజన్‌కు సంబంధించి, రైతు భరోసా నిధులను సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. అయితే గత ప్రభుత్వం రైతులందరికి రైతు బంధు ఇవ్వగా.. పంటలు పండించని వారు కూడా రైతు బంధు తీసుకొంటున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేసింది. దీంతో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దీనిపై కసరత్తు ప్రారంభించింది. చాలా మంది రైతులు తమ పొలాలను కౌలుకు ఇస్తున్నారు. దాని ద్వారా కౌలు డబ్బులు పొందుతున్నారు. అలాగే ప్రభుత్వం నుంచి రైతు భరోసా పథకాన్ని కూడా పొందడంతో వారు ఆర్ధికంగా చాలా లబ్దిపొందుతున్నారు. కానీ చాలా మంది చిన్నా సన్నకారు రైతులు నష్టపోతున్నారని రేవంత్ సర్కార్ భావించింది.
అందుకోసం రైతు భరోసా అమలులో కీలక మార్పులు చేసింది. ఇకపై పంటలు పండిస్తున్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందనుంది. దీనివల్ల సుమారు 10 లక్షల ఎకరాలకు రైతు భరోసా కట్ కాబోతుంది. సాగు చేసే రైతులకు మాత్రమే పథకాన్ని ఇవ్వడం ద్వారా సాగును ప్రోత్సహించటంతో పాటు.. బీడు భూములకు పథకం నుంచి తీసివేయడం ద్వారా ప్రభుత్వంపై భారాన్ని కూడా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.
గతంలోనే చెప్పిన సీఎం..
రైతు భరోసాపై గతంలో సీఎం మాట్లాడుతూ.. ఇకపై రైతు భరోసా నిధులను కేవలం సాగు చేసే భూమికే అందించాలని నిర్ణయించామని తెలిపారు. అలాగే సాగులో లేని భూములకు పెట్టుబడి సాయం ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఇటీవల ప్రభుత్వం చేసిన సర్వేలో కొండలు, కమర్షియల్ ప్లాట్లు ఉన్నవారికి కూడా పథకం ద్వారా లబ్ది పొందుతున్నట్లు తేలగా.. ప్రభుత్వం దీనిపై చర్యలకు ఉపక్రమించింది.
65లక్షల మంది అర్హులు..
సింథటిక్ ఎపర్చర్ రాడార్ ఏజెన్సీ సాయంతో శాటిలైట్ మ్యాపింగ్ చేస్తున్నారు. అయితే ఇది ప్రస్తుతానికి వాయిదా పడింది. వర్షాకాలంలో ఇచ్చినట్లు గానే యాసంగిలో కూడా ఇస్తామని చెబుతున్నారు. కాగా సంక్రాంతికి రైతు భరోసా డబ్బులు రిలీజ్ చేయనుండగా 65లక్షల మంది అర్హులున్నట్లు తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, రైతు బంధు పేరును రైతు భరోసాగా మార్చి.. ఎకరాకు రూ.6 వేలు పెట్టుబడి సాయంగా ఇస్తుంది.
క్షేత్రస్థాయిలో సర్వే..
అసలైన అన్నదాతలకే రైతు భరోసా దక్కాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీఆర్ఎస్ హయాం నుంచి కొండలు, కమర్షియల్ ప్లాట్లు ఉన్నవారికీ సాయం అందుతోందని తేల్చింది. వారికి చెక్ పెట్టేలా శాటిలైట్ మ్యాపింగ్ చేపట్టింది. సింథటిక్ ఎపర్చర్ రాడార్ ఏజెన్సీ సాయంతో అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేసి అనర్హులను గుర్తిస్తున్నారు. కాగా సంక్రాంతికి రైతు భరోసా డబ్బులు రిలీజ్ చేయనుండగా 65లక్షల మంది అర్హులున్నట్లు తెలిపింది.
