కేసీఆర్ ఆమరణ దీక్షకు పదహారేళ్లు
TG: 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు నేటికి పదహారేళ్లు పూర్తయ్యా యి. కరీంనగర్ లోని ఉత్తర తెలంగాణ భవన్ నుంచి సిద్దిపేట రంగధాంపల్లిలో ఏర్పాటు చేసిన దీక్షాస్థలానికి బయలుదేరిన కేసీఆర్ను అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారు. దీంతో ఆయన జైలులోనే దీక్ష కొనసాగించారు. 2009 డిసెంబర్ 9న ప్రత్యేక తెలంగాణకు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఆయన దీక్ష విరమించారు.
