రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు ఆత్మీయ పరామర్శ
తమను నమ్ముకున్న ప్రజలు ఆపదలో ఉన్నారని తెలిసిన వెంటనే ఆగమేఘాల మీద స్పందించే నాయకురాలు అంటే మంత్రి కొండా సురేఖ గారే అని మరోసారి నిరూపితమైంది. పండుగ రోజు అయినప్పటికీ వ్యక్తిగత కార్యక్రమాలను పక్కనపెట్టి ఆమె నేరుగా వరంగల్‌లోని సంరక్ష హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స పొందుతున్న పలువురు బాధితులను పరామర్శించారు.
ఇటీవల గుండెపోటుతో చికిత్స పొందుతున్న మాజీ మార్కెట్ డైరెక్టర్ సంగరబోయిన చందర్ గారిని మంత్రి కొండా సురేఖ గారు ప్రత్యేకంగా పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం హాస్పిటల్ వైద్యులతో మాట్లాడి చికిత్సకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు అత్యుత్తమ వైద్యం అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యులకు మంత్రి సురేఖ గారు సూచించారు.
