ఇలాంటి అబ్బాయిలకు గుణపాఠం నేర్పించాల్సిందే: సుప్రీంకోర్టు
ముంబయి హిట్-అండ్-రన్ కేసులో నిందితుడు మిహిర్ షాకు సుప్రీం కోర్టు బెయిల్ తిరస్కరించింది. చేసిన నేరానికి గానూ.. కొన్ని రోజుల పాటు జైల్లో ఉండాల్సిందేనని పేర్కొంది. శివసేన మాజీ నాయకుడి కుమారుడు మిహిర్ షా.. గత ఏడాది జులైలో వర్లీ ప్రాంతంలో మద్యం మత్తులో బీఎండబ్ల్యూ కారును వేగంగా నడుపుతూ ముందువెళ్తున్న స్కూటీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో మహిళ మృతి చెందగా.. ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం అతను పరారయ్యాడు.
