హిడ్మా ఎన్కౌంటర్పై అనుమానాలు: NHRCకి ఫిర్యాదు
హిడ్మా ఎన్కౌంటర్పై అనుమానాలు: NHRCకి ఫిర్యాదు
మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్పై అనుమానాలు వ్యక్తం చేస్తూ న్యాయవాది కె. విజయ్ కిరణ్ జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)ను ఆశ్రయించారు. ఎన్కౌంటర్ ఫేక్ అయ్యే అవకాశంపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. FIR నంబర్లు 52/2025, 53/2025లో అనుమానాస్పద అంశాలున్నాయని, NHRC మార్గదర్శకాల ప్రకారం పోలీసులపై FIR నమోదు కాలేదని, దర్యాప్తు తటస్థంగా జరగలేదని ఆయన ఆరోపించారు. ఫేక్ ఎన్కౌంటర్ అయితే ప్రభుత్వ తప్పిదమని వ్యాఖ్యానించారు.
