హాట్ ఎయిర్ బెలూన్ లో సాంకేతిక సమస్య.. మణికొండ నిక్నాపూర్ చెరువు దగ్గర ఎమర్జన్సీ ల్యాండింగ్
నార్సింగి సర్కిల్ మణికొండ సమీపంలోని నిక్నాపూర్ చెరువు వద్ద హాట్ ఎయిర్ బెలూన్ షోలో అనుకోని ఘటన చోటుచేసుకుంది. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో 14వ నెంబర్ హాట్ ఎయిర్ బెలూన్‌ను అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
నిన్న (జనవరి 16) ప్రారంభమైన హాట్ ఎయిర్ బెలూన్ షోలో భాగంగా గగనంలోకి ఎగిరిన బెలూన్‌లో అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో నిక్నాపూర్ గ్రామ శివారులోని చెరువు సమీపంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు.
ఈ ఘటనతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా, బెలూన్‌లో ఉన్న ముగ్గురూ ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం బెలూన్‌ను హోల్డింగ్ చేసి ట్రక్కుల ద్వారా అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
