తెలంగాణ గ్లోబల్ సమిట్.. ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ అంశంపై చర్చ
హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కొనసాగుతోంది. రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా ‘ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్’ అంశంపై చర్చ నిర్వహించారు. దీనిలో మంత్రి అజారుద్దీన్‌తో పాటు క్రీడా ప్రముఖులు అనిల్ కుంబ్లే, పుల్లెల గోపీచంద్, పీవీ సింధు, అంబటి రాయుడు, గుత్తా జ్వాల పాల్గొన్నారు. క్రీడాకారుల విజయానికి అనేక అంశాలు దోహదం చేస్తాయని పీవీ సింధు అన్నారు. మౌలిక వసతులు, కోచ్‌లు చాలా కీలకమని చెప్పారు. ప్రతి దశలోనూ క్రీడాకారులకు ప్రోత్సాహం అవసరమన్నారు.
