గోదావరిఖని గనిలో ఉద్రిక్తత
మహిళా కార్మికురాలిపై వేధింపుల ఆరోపణలతో విధుల బహిష్కరణ, ధర్నా
పెద్దపల్లి జిల్లా, గోదావరిఖని:
గోదావరిఖని జీడీకే–1 ఇంక్లైన్ గనిలో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహిళా కార్మికురాలిపై వేధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో గని కార్మికులు విధులను బహిష్కరించి గని వెలుపల ధర్నాకు దిగారు.
సదరు మహిళా కార్మికురాలు సహచర కార్మికుల మధ్య విభేదాలు రేకెత్తించే విధంగా వ్యవహరిస్తోందని కార్మికులు ఆరోపించారు. ఈ అంశంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ గని కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేశారు.
విషయం తెలుసుకున్న రామగుండం జనరల్ మేనేజర్ లలిత్ కుమార్‌కు అధికారులు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అనంతరం ఆయన కార్మికులతో మాట్లాడి సమస్యను త్వరగా పరిష్కరిస్తామని, ఆరోపణలపై విచారణ జరిపి సంబంధిత మహిళా కార్మికురాలిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
జీఎం హామీతో కార్మికులు తమ ఆందోళనను విరమించి తిరిగి విధుల్లో చేరారు. దీంతో గనిలో సాధారణ కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యాయి.
