ఆస్ట్రేలియాలో ఉగ్రదాడి తండ్రీకొడుకుల పనే
ఆస్ట్రేలియా సిడ్నీలోని బోండీ బీచ్‌లో ఉగ్రదాడి తండ్రీకొడుకుల పనే అని దర్యాప్తు బృందాలు గుర్తించాయి. నిందితులు సాజిద్ అక్రమ్ (50), అతడి కుమారుడు నవీద్ అక్రమ్ (24) కాల్పులకు తెగబడినట్లు తేల్చారు. సాజిద్‌ను పండ్ల దుకాణం నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. ఆదివారం సిడ్నీలోని బోండీ బీచ్‌లో ఉత్సవం నిర్వహించుకుంటున్న యూదులపై ఇద్దరు ఉగ్రవాదులు సాజిద్, నవీద్ కాల్పులకు తెగబడ్డారు. ఈ దుర్ఘటనలో 16 మంది మరణించారు. 38 మంది గాయపడ్డారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో సాజిద్ మృతి చెందాడు.
