డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టడం వల్లే ప్రమాదం..
బెంగళూరు (గ్రామీణం), చిత్రదుర్గ: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదంలో పలువురు సజీవదహనమయ్యారు. బస్సు డీజిల్ ట్యాంకర్‌ను లారీ ఢీకొట్టడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. గురువారం తెల్లవారుజామున బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న సీబర్డ్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కంటెయినర్ లారీ ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. దీంతో బస్సులోని ప్రయాణికులు కొందరు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, కండక్టర్ ప్రాణాలతో బయటపడ్డారు.
