ఏఐ ఎక్స్ లెన్స్ సెంటర్ ఏర్పాటుకు ఆస్ట్రేలియాతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం.
ఆస్ట్రేలియాకు చెందిన డీకిన్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో రాష్ట్రంలో కృత్రిమ మేథకు సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. దేశంలోనే ఈ తరహా నైపుణ్య శిక్షణ కేంద్రం (సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్) మొట్టమొదటిది. ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్యా మంత్రి జూలియన్ హిల్ తో కలిసి సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల బాబు గారు ఎంఓయు వివరాలను వెల్లడించారు.
ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయనున్న ఏఐ యూనివర్సిటీలో ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను నెలకొల్పనున్నట్టు శ్రీధర్ బాబు గారు తెలిపారు.
కాలేజీల నుంచి అకడమిక్ గ్రాడ్యుయేట్లను కాకుండా ప్రపంచ స్థాయి నైపుణ్యాలతో కూడిన ప్రతిభావంతులను తయారు చేయాలన్న లక్ష్యంతోనే ఆస్ట్రేలియా ప్రభుత్వంతో ఈ భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నట్టు ఆయన తెలిపారు.
విదేశీ విశ్వవిద్యాలయాలను రాష్ట్రానికి తీసుకురావడానికి సిఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఈ ఒప్పందం జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు గారు వెల్లడించారు.
