tirumala donor benefits: తిరుమలలో అన్నదానం: రూ.లక్ష విరాళమిచ్చే భక్తులకు దర్శనం, ఇతర సౌకర్యాలివే
మన ప్రధాన దేవాలయాలు విరాళాలను విస్తృతంగా ప్రోత్సహిస్తున్నాయి. అన్నదానం నుంచి గోసేవ వరకు దాతలకు అవకాశం కల్పిస్తున్నాయి. వారి దాతృత్వానికి తగిన సత్కారమూ చేస్తున్నాయి. ప్రత్యేక దర్శనం, వసతి సదుపాయాలు కల్పిస్తున్నాయి. ఇచ్చే విరాళాలకు సెక్షన్ 80జీ ప్రకారం ఆదాయపన్ను మినహాయింపూ ఉంది.

మన ప్రధాన దేవాలయాలు విరాళాలను విస్తృతంగా ప్రోత్సహిస్తున్నాయి. అన్నదానం నుంచి గోసేవ వరకు దాతలకు అవకాశం కల్పిస్తున్నాయి. వారి దాతృత్వానికి తగిన సత్కారమూ చేస్తున్నాయి. ప్రత్యేక దర్శనం, వసతి సదుపాయాలు కల్పిస్తున్నాయి. ఇచ్చే విరాళాలకు సెక్షన్ 80జీ ప్రకారం ఆదాయపన్ను మినహాయింపూ ఉంది.
యాదగిరిగుట్ట
ఆలయానికి వచ్చే భక్తులకు నిత్యం సమారు 1,500 మందికి అన్నదానం సదుపాయం ఉందిక్కడ.
- అన్నదానానికి రూ.116, ఆపైన ఎంతైనా ఇవ్వవచ్చు. రూ.50 వేల విరాళమిస్తే ఏడాదిలో దాతతో పాటు ఆరుగురికి మూడుసార్లు బ్రేక్ దర్శనం, రెండుసార్లు ప్రత్యేక దర్శనం చేయిస్తారు. రూ.లక్ష విరాళానికి ఏడాదిలో నాలుగుసార్లు బ్రేక్, నాలుగుసార్లు ప్రత్యేక దర్శనం…రూ.2 లక్షలు ఆపైన విరాళమిస్తే.ఏడాదిలో ఎనిమిదిసార్లు బ్రేక్ లేదా ప్రత్యేక దర్శనంతో పాటు డబుల్‌బెడ్రూం వసతి సౌకర్యం కల్పిస్తారు. అభిషేకం లడ్డూ ప్రసాదం, శేషవస్త్రం ఒకసారి ఇస్తారు.
- గోదాన పథకం ఉంది. రూ.25 వేలు ఇస్తే దాత పేరుతో గోపూజ చేస్తారు. నేరుగా గోవును తీసుకువచ్చి కూడా విరాళంగా ఇవ్వొచ్చు. గోదానం పథకానికి రూ.10 వేలు, రూ.25 వేల విరాళం ఇస్తే అదే రోజు గోపూజ చేయించి ప్రత్యేక దర్శనానికి తీసుకెళతారు.
- సత్రం నిర్మాణానికి రూ.6 లక్షల నుంచి రూ.కోటి వరకు, ఆపైన కూడా విరాళం ఇవ్వొచ్చు. రూ.6 లక్షల విరాళమిస్తే సంవత్సరంలో 30 రోజులు గదిని ఉచితంగా కేటాయిస్తారు. రూ.300 టికెట్ ప్రత్యేక దర్శనానికి దాతతో పాటు ఆరుగురు సభ్యులను ఉచితంగా అనుమతిస్తారు. రూ.25 లక్షల పైన విరాళం అందిస్తే- రాజపోషకుడుగా గుర్తించి, ఉచితంగా ఆరుగురికి ప్రత్యేక దర్శనం అపరిమితం. దాంతో పాటు హారతి ఇస్తారు. 30 రోజులు ఉచిత వసతి కూడా ఉంటుంది.
కొమురవెల్లి
- సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో కాటేజీలు నిర్మించే దాతలకు ప్రత్యేక పథకం ఉంది. సంవత్సరంలో నెల రోజుల పాటు దాతకు కాటేజీని ఉచితంగా కేటాయిస్తారు. ప్రత్యేక దర్శనానికి అనుమతిస్తారు.
- ఇక్కడ అన్నదాన పథకానికి రూ.1,00,116, రూ.50,116.. రూ.25,116 విరాళాలు ఉన్నాయి. నిత్యాన్నదాన సత్రంలో విరాళాలిస్తే దాతల పేరుతో అన్నదానం చేస్తారు. ఉచితంగా ప్రత్యేకదర్శన అవకాశం కల్పిస్తారు.
భద్రాచలం
- నిత్యం 1,500-2,000 మంది భక్తులకు ఆలయంలో అన్నదానం చేస్తున్నారు. అన్నదానం పథకానికి.. రూ.లక్ష అంతకుమించి విరాళమిచ్చేవారిని మహారాజపోషకులుగా గుర్తిస్తారు. దాత పేరుతో జీవితాంతం రోజుకు ఇద్దరు భక్తులకు అన్నదానం చేస్తారు. రూ.50 వేలిస్తే రాజపోషకులంటారు. నిత్యం ఒక భక్తుడికి అన్నదానం చేస్తారు. రూ,1,116 కన్నా ఎక్కువ ఇస్తే ఏడాదిలో ఒకరోజు వారి పేరుతో అన్నదానం చేస్తారు.
- గోకులరామమ్ (గోశాల) పేరుతో గోసంరక్షణ, వనసంరక్షణ ట్రస్ట్‌లు ఉన్నాయి ఇక్కడ.
- గోశాలకు గోవులను దానంగా ఇవ్వొచ్చు. గోగ్రాసం కోసం ఒక ఆవుకు ఏడాదికి రూ.25 వేలు ఇవ్వాలి. మొత్తం గోశాల నిర్వహణ ఒక రోజుకు రూ.10 వేలు… ఒక ఆవును నెలంతా దత్తత తీసుకుంటే రూ.5 వేలు చెల్లించాలి.
- రూ.10 లక్షలపైన విరాళం ఇచ్చినవారి గోత్రనామాలతో గోపూజ చేస్తారు. ఏడాదిలో 8 సార్లు 8 మందికి అంతరాలయ అర్చన అవకాశం ఉంటుంది.
- శ్రీరామనవమి, వైకుంఠ ఏకాదశి రోజున దాత కోరిక మేరకు ఆ దంపతులకు టికెట్లు ఇస్తారు.
వేములవాడ
- ఆలయంలో నిత్యం 500-1000 మందికి అన్నదానం చేస్తున్నారు. గోదానం, అన్నదానం చేసే దాతలకు ప్రత్యేక దర్శనం ఉంటుంది.
- నేరుగా గోవుల్ని, కోడెల్ని తెచ్చి ఆలయానికి దానం చేయవచ్చు. మేత కోసం ఎంతైనా విరాళం ఇవ్వొచ్చు.
- అన్నదాన పథకం కోసం రూ.375 చెల్లిస్తే ఆ దాత పేరుతో 20-25 మంది భక్తులకు భోజనం పెడతారు.
- రూ.10,116 చెల్లిస్తే మహారాజపోషకులుగా, రూ.5,116 చెల్లిస్తే పోషకులుగా గుర్తిస్తారు. సంవత్సరంలో దాతలు కోరిన ఒకరోజున వారి పేరుతో భక్తులకు అన్నదానం చేస్తారు.
కాళేశ్వరం
అన్నదానం పథకానికి రూ.5,116 చెల్లించొచ్చు. రూ.1,00,116 చెల్లిస్తే మహాదాతలుగా గుర్తిస్తారు. రూ.25,116 చెల్లిస్తే మహారాజ పోషకులు, రూ.10,116కు రాజపోషకులు, రూ.5,016కు పోషకులుగా గుర్తింపు లభిస్తుంది. దాతలకు ఏడాదిలో 3, 4 సార్లు ప్రత్యేక పూజలకు అనుమతిస్తారు. అభిషేకం దర్శనానికి అనుమతిస్తారు.
తిరుమల…
నిత్యం లక్ష మందికిపైగా భక్తులకు అన్నదానం చేస్తున్నారు. ఈ పథకం కింద విరాళాలకు రెండు అవకాశాలున్నాయి.
- 1. భక్తులు రూపాయి నుంచి కోటి, ఆపై..ఎంతైనా ఇవ్వొచ్చు.
- 2. ఒక రోజు మొత్తం భక్తులకు అన్నదానం చేయాలంటే రూ.44 లక్షలివ్వాలి. అల్పాహారానికి రూ.10 లక్షలు, మధ్యాహ్న భోజనానికి రూ.17 లక్షలు, రాత్రి భోజనానికి అయితే రూ.17 లక్షలివ్వాలి.
- రూ. 1-5 లక్షల విరాళం: అయిదుగురికి ఏడాదిలో మూడు రోజులు- సుపథం దర్శనం, రూ.100 గదిలో వసతి, 10 చిన్నలడ్డూలు, 5 మహాప్రసాదాలు, దుపట్టా, జాకెట్ ముక్క ఇస్తారు.
- రూ.10-25 లక్షలిస్తే : అయిదుగురికి మూడు రోజులు బిగినింగ్ బ్రేక్‌దర్శనం, రూ.1000 గదిలో వసతి, 20 చిన్న లడ్డూలు, 10 మహాప్రసాదాలు, దుపట్టా, జాకెట్ ముక్క, 50 గ్రాముల వెండి కాయిన్ ఇస్తారు.
- రూ.25-50 లక్షలిస్తే : అయిదుగురికి మూడు రోజులు బిగినింగ్ బ్రేక్‌దర్శనం, ఒకరోజు సుపథం దర్శనం, రూ.1500 గదిలో వసతి, 4 పెద్దలడ్డూలు, 5 చిన్నలడ్డూలు, 10 మహాప్రసాదాలు, దుపట్టా, జాకెట్ ముక్క, 5 గ్రాముల బంగారు డాలర్, 50 గ్రాముల వెండి కాయిన్ ఇస్తారు.
- రూ.50-75 లక్షలిస్తే : అయిదుగురికి ఒకరోజు సుప్రభాత సేవకు అవకాశం కల్పిస్తారు. మూడు రోజులు బిగినింగ్ బ్రేక్ దర్శనం, రెండ్రోజులు సుపధం నుంచి దర్శనం చేయిస్తారు. మూడు రోజులు రూ.2 వేల వసతి కేటాయిస్తారు. 6 పెద్ద అడ్డూలు, 10 చిన్న లడ్డూలు, 10 మహాప్రసాదాలు, దుపట్ట్టా, జాకెట్ ముక్క 5 గ్రాముల బంగారు డాలర్, 50 గ్రాముల వెండి కాయిన్ ఇస్తారు.
- రూ.75లక్షలు- రూ.కోటి విరాళం: అయిదుగురికి రెండు రోజుల సుప్రభాత సేవకు అవకాశం ఉంటుంది. నాలుగు రోజులు సుపథం నుంచి, మూడురోజులు బిగినింగ్ బ్రేక్ దర్శనాలు ఉంటాయి. 10 చిన్న, 20 పెద్దలడ్డూలు, 10 మహాప్రసాదాలతో పాటు దుపట్టా, జాకెట్ ముక్క ఇస్తారు. ఒక రోజు వేద ఆశీర్వచనం కూడా ఉంటుంది. 5 గ్రాముల బంగారు డాలర్, 50 గ్రాముల వెండి కాయిన్ ఇస్తారు.
- విరాళం రూ.కోటి, ఆపైన ఉంటే: అయిదుగురికి మూడ్రోజుల సుప్రభాత సేవ ఉంటుంది. నాలుగు రోజులు సుపథం నుంచి మూడ్రోజులు బిగినింగ్ బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు. 10 చిన్న, 20 పెద్దలడ్డూలు, 10 మహాప్రసాదాలతో పాటు దుపట్ట్టా, జాకెట్ ముక్క ఇస్తారు. ఒక రోజు వేద ఆశీర్వచనం చేయిస్తారు. 5 గ్రాముల బంగారు డాలర్, 50 గ్రాముల వెండి కాయిన్ ఇస్తారు.
