కేపీహెచ్‌బీలో విషాదం: మూడో అంతస్తు నుంచి దూకి యువతి ఆత్మహత్య
హైదరాబాద్ (కేపీహెచ్‌బీ): కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం, చిత్తూరు జిల్లా మద్దినాయనిపల్లి గ్రామానికి చెందిన అనిత (23) హైదరాబాద్‌లో నివసిస్తూ ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. గురువారం ఆమె పనిచేస్తున్న సీబీసీఐడీ కాలనీలోని ప్రైవేట్ కంపెనీ కార్యాలయ భవనం మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
