చిట్యాలలో చరిత్ర సృష్టించిన ట్రాన్స్‌జెండర్ సుధాకర్ – స్వతంత్ర అభ్యర్థిగా ఘన విజయం
నల్లగొండ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డులో ట్రాన్స్‌జెండర్ సుధాకర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
1వ వార్డు ఎస్సీ జనరల్ వర్గానికి రిజర్వ్ కాగా, సుధాకర్ అభివృద్ధి హామీలతో ప్రజల ముందుకు వచ్చారు. వార్డు అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, పారదర్శక పాలన వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఓటర్ల విశ్వాసాన్ని పొందారు.
ఈ వార్డులో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్–కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) పొత్తులో భాగంగా సీపీఎం అభ్యర్థి, అలాగే భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చిన, చివరికి ప్రజలు స్వతంత్ర అభ్యర్థి సుధాకర్‌కు మద్దతు పలికారు.
సుధాకర్ విజయం ట్రాన్స్‌జెండర్ సమాజానికి రాజకీయ ప్రాతినిధ్యం దిశగా కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లుగా భావిస్తున్నారు. ఇది స్థానిక రాజకీయాల్లోనే కాక రాష్ట్ర స్థాయిలోనూ ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.
