నియామకాల్లో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలి: రాష్ట్రపతి
హైదరాబాద్: నియామకాల విషయంలో సర్వీస్ కమిషన్లు వేగంగా స్పందిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఛైర్‌పర్సన్ల నేషనల్ కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. ‘‘1950 తర్వాత యూపీఎస్సీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఏర్పాటు మొదలైంది. వీటి విషయంలో అంబేడ్కర్ కీలక పాత్ర పోషించారు. నియామకాల్లో ఎదురవుతున్న సవాళ్లకు త్వరితగతిన పరిష్కారం అవసరం. నియామకాల్లో అత్యంత పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలి’’ అని రాష్ట్రపతి తెలిపారు.
