కేంద్ర బడ్జెట్ 2026: మద్యం, సిగరెట్ల ధరలు పెంపు
కేంద్ర బడ్జెట్ 2026లో ‘సిన్ గూడ్స్’గా పరిగణించే మద్యం, సిగరెట్లపై పన్నులు పెరగడంతో ధరలు గణనీయంగా పెరిగాయి. ఆల్కహాల్ స్క్రాప్, మినరల్ సేల్స్‌పై టీసీఎస్ (TCS) ను 1 శాతం నుంచి 2 శాతానికి పెంచడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ సుంకాలను సవరించే అవకాశం ఉండటంతో మద్యం ధరలపై ప్రభావం పడింది.
ఈ పెంపు నేపథ్యంలో గతంలో రూ.1,000గా ఉన్న మద్యం బాటిల్ ధర రూ.1,050 నుంచి రూ.1,100 వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
అలాగే సిగరెట్లపై ఇప్పటికే ఉన్న 40 శాతం జీఎస్టీకి తోడు అదనపు సెస్, ఎక్సైజ్ డ్యూటీలు విధించడంతో సిగరెట్ ధరలు కూడా పెరిగాయి. అయితే బీడీల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
