వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాల నిలిపివేత..
రాజన్న సిరిసిల్ల : దక్షిణ కాశీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తుల దర్శనాలను నిలిపివేశారు.
- ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో భక్తులు ఆలయంలోకి ప్రవేశించకుండా ముందు భాగంలోని ప్రధాన గేటు వద్ద ఇనుప రేకులను అమర్చారు.
- ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా ఇప్పటికే అనుబంధ ఆలయమైన భీమేశ్వరాలయంలో రాజన్న దర్శనాలు, మొక్కలు, పూజాది కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.
- అయితే, రాజన్న ఆలయం ఎదుట ప్రచార రథంపై స్వామివారి దర్శనం కల్పించారు. ఎల్ఈడీ తెరపై స్వామివారి దర్శనం భక్తులకు కల్పించేలా ఏర్పాట్లు చేశారు. ఆలయ విస్తరణలో భాగంగా ఇప్పటికే భీమేశ్వరాలయంలో భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నారు రాజరాజేశ్వరస్వామి స్వామి ఆలయ అధికారులు. ఎంతో దూరం నుంచి వచ్చి స్వామివారికి మొక్కు చెల్లిందమని వస్తే ఆలయ అధికారులు ఇలా చేయడం భావ్యం కాదని భక్తులు మండిపడుతున్నారు. ఇంత చలిలోనూ స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తున్నామని.. అయినా అధికారులు కనికరించడం లేదని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
