ప్రజలతో మమేకమై ప్రజాసేవ చేస్తాం….
- అభివృద్ధి ధ్యేయంగా, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుంది
- రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు
జనవరి 19, 2026:
రాష్ట్రంలో ప్రజలతో మమేకమై ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్నామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. సోమవారం జిల్లాలోని చెన్నూర్ మండల కేంద్రంలో చేపట్టిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ లతో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ ప్రజలతో మమేకమై ప్రజా సేవ చేస్తున్నామని, ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్నామని తెలిపారు. చెన్నూర్ పట్టణంలో 47 కోట్ల 11 లక్షల రూపాయలతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ను మంజూరు చేసి నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందని తెలిపారు. వృత్తి విద్యా కోర్సులలో నైపుణ్య శిక్షణను అందించి యువతకు ఉపాధి కల్పించడం కొరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. చెన్నూర్ నియోజకవర్గంలో 40 కోట్ల రూపాయలతో అంతర్గత రహదారులు, మురుగు కాలువల నిర్మాణం చేపట్టడం జరిగిందని, సమస్యల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. గత 10 సంవత్సరాలుగా అందని రేషన్ కార్డులను అర్హులకు అందించి ప్రజా పంపిణీ వ్యవస్థలో చౌక ధరల దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇండ్లు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ సోమనపల్లి ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను మంజూరు చేసి నిర్మాణ పనులు చేపట్టి కొనసాగుతున్నాయని తెలిపారు. విదేశీ విద్యను అభ్యసించే విద్యార్థులకు విదేశీ విద్యా పథకం ద్వారా 20 లక్షల రూపాయలను అందించి ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. చెన్నూర్ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం 100 పడకలతో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేపట్టడం జరిగిందని, ఈ ప్రాంతంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం డయాలసిస్ సెంటర్ ఏర్పాటుచేసి సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షల రూపాయల పరిమితికి పెంచడంతో పాటు అర్హులైన బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం జరుగుతుందని తెలిపారు. జైపూర్ పవర్ ప్లాంట్ ను విస్తరిస్తూ మరొక ప్లాంట్ నిర్మాణం చేపట్టడం జరిగిందని, తద్వారా ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు 9 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందించడం జరుగుతుందని, ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలు అన్ని రంగాలలో రాణించేందుకు ఆర్థిక చేయూత అందించి ప్రోత్సహించడం జరుగుతుందని, క్యాంటీన్, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫాములు తయారు చేయడం, ఇతర వ్యాపారాలను నిర్వహించే విధంగా తోడ్పాటు అందించడం జరుగుతుందని తెలిపారు. చెన్నూర్ లో మహిళా సంఘాలకు పెట్రోల్ బంకు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఈ ప్రాంతంలో ఇసుక మాఫియా పై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రభుత్వ మన ఇసుక వాహనం ద్వారా తక్కువ ధరకు వినియోగదారులకు ఇసుకను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. అమృత్ పథకం క్రింద చెన్నూర్ మున్సిపాలిటీ కి 30 కోట్ల రూపాయలు మంజూరు చేసి నీటి ట్యాంకులు, పైప్ లైన్ల నిర్మాణం చేపట్టి ప్రతి ఇంటికి శుద్ధమైన త్రాగునీటిని నిరంతరం అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని తెలిపారు.
జిల్లా ఇన్చార్జి మంత్రి మాట్లాడుతూ ఎంతో మంది తెలంగాణ ప్రజల ప్రాణబ్ త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. రైతు సంక్షేమంలో భాగంగా దాదాపు 20 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం జరిగిందని, రైతు భరోసా, రైతు భీమా పకడ్బందీగా అమలు చేయడం జరిగిందని తెలిపారు. చెన్నూర్ మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, ప్రజల సంక్షేమం దిశగా కృషి చేస్తామని తెలిపారు. అర్హులైన పేదలకు రేషన్ కార్డులు అందించి సన్న బియ్యం ప్రతినెల పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజా సంక్షేమం దిశగా ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చెన్నూరు పట్టణంలో ప్రభుత్వం చేపట్టిన అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్ ద్వారా సమీప ప్రాంతాలలోని నిరుద్యోగ యువతకు అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ అందించి స్వయం ఉపాధి పొందేలా తర్ఫీదు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పనులను వేగవంతం చేసి వచ్చే విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు తీసుకునే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆదాయం చేకూరేలా ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు.. మహిళల సంక్షేమంలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డుల జారీ వంటి అనేక కార్యక్రమాలను జిల్లాలో అధికారుల సమన్వయంతో సమర్ధవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు.
అనంతరం చెన్నూర్ పరిధిలోని 214 స్వయం సహాయక సంఘాల సభ్యులకు 76 లక్షల 65 వేల 430 రూపాయల చెక్కును అందజేశారు.
చెన్నూర్ పట్టణంలోని 16వ వార్డు కొత్తగూడెం కాలనీలో 50 లక్షల రూపాయల సి. ఎస్. ఆర్. నిధులతో ముదిరాజ్ భవన నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. 8వ వార్డులో 1 కోటి 40 లక్షల రూపాయల డి ఎం ఎఫ్ టి నిధులతో బైపాస్ సి సి రోడ్డు నిర్మాణం, 9వ వార్డులో 18 లక్షల 50 వేల రూపాయలతో సి సి రోడ్డు పనులు, 15వ వార్డులో 20 లక్షల రూపాయల ఎస్ బి ఎం నిధులతో నూతన ఆస్పిరేషన్ టాయిలెట్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
