వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చున్నీతో హత్య చేసిన భార్య
తెలంగాణ : హైదరాబాద్ కూకట్పల్లి పరిధిలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో భర్త సుధీర్ రెడ్డిని భార్య ప్రసన్న చున్నీతో ఉరేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. గత నెల 24న సుధీర్ రెడ్డి మృతి చెందగా, విచారణలో భార్యే హత్య చేసినట్టు ఒప్పుకుంది. హత్యకు వారం రోజుల ముందే తన భార్య తనను చంపేందుకు ప్రయత్నిస్తోందని సుధీర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడైంది. నిందితురాలిని రిమాండ్ నిమిత్తం కంది జైలుకు తరలించారు.
