ములుగు మున్సిపాలిటీ ఎన్నికల్లో మహిళలకు పెద్దపీట
ములుగు: ములుగు మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పించాయి. మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నాయి.
బీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా 14 మంది మహిళా అభ్యర్థులను బరిలోకి దించగా, కాంగ్రెస్ పార్టీ 12 మంది, బీజేపీ 10 మంది మహిళలకు టికెట్లు కేటాయించింది.
మొత్తం 20 వార్డులు ఉన్న ములుగు మున్సిపాలిటీలో, ప్రధాన పార్టీల నుంచి 36 మంది మహిళలు కౌన్సిలర్ పదవులకు పోటీ చేస్తున్నారు.
అదే సమయంలో, ఈ మున్సిపాలిటీలో మున్సిపల్ ఛైర్మన్ పదవిని మహిళలకు కేటాయించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మహిళా నేతృత్వానికి ఇది కీలక అవకాశంగా మారిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
