హైదరాబాద్‌లో చెత్త సంక్షోభం: ఆటోల ముసుగులో మధ్యవర్తుల దందా, ప్రభుత్వం సీరియస్
GHMC పరిధిలో చెత్త సేకరణ వ్యవస్థ గందరగోళానికి గురవడంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. Hyderabad లో స్వచ్ఛ ఆటోల పేరుతో మధ్యవర్తులు భారీ వసూళ్లు చేస్తుండగా, స్లమ్ ప్రాంతాల్లో చెత్త ఎత్తకపోవడం వల్ల రోడ్లపై పేరుకుపోతున్నది.
2009 ఒప్పందం ప్రకారం చెత్త నిర్వహణ బాధ్యత Ramky సంస్థదైనా, అమలులో లోపాలు — స్వచ్ఛ ఆటో కార్మికులు, మధ్యవర్తులు, అధికారులు మధ్య విభేదాలతో సమస్య మరింత తీవ్రరూపం దాల్చింది. డబ్బులు ఇచ్చే కాలనీల నుంచే చెత్త తీసుకెళ్తూ, పేద ప్రాంతాలను పట్టించుకోకపోవడం ప్రధాన ఆరోపణ.
ఈ పరిస్థితిపై సీఎం Revanth Reddy సీరియస్‌గా స్పందించి — నగరంలో చెత్త కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్వచ్ఛ ఆటో కార్మికులు, రాంకీ సంస్థ, మున్సిపల్ అధికారులు కలిసి చర్చిస్తేనే సమస్యకు శాశ్వత పరిష్కారం సాధ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
