YSRCP: వైసీపీకి మరో బిగ్ షాక్.. టీడీపీలోకి పలువురు..
వైసీపీకి మరో గట్టి షాక్ తగిలింది. జగన్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో భారీగా చేరారు. సుమారుగా 200 కుటుంబాలు ఫ్యాన్ పార్టీని వదలి పసుపు కండువా కప్పుకున్నాయి.
విజయనగరం, డిసెంబరు 29 : వైసీపీకి (YSRCP) మరో గట్టి షాక్ తగిలింది. జగన్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో భారీగా చేరారు. సుమారుగా 200 కుటుంబాలు ఫ్యాన్ పార్టీని వదలి పసుపు కండువా కప్పుకున్నాయి. ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ నేతృత్వంలో వీరు టీడీపీలో చేరారు. వీరికి పసుపు కండువాలు కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు.
ఈ చేరికలు రాజాం నియోజకవర్గంలో వైసీపీపై తీవ్ర ప్రభావం చూపుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వైసీపీపై ఉన్న తీవ్ర అసంతృప్తితోనే వారు టీడీపీలో చేరడానికి కారణంగా తెలుస్తోంది. ఈ చేరికలతో టీడీపీకి స్థానికంగా బలం పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాజాం నియోజకవర్గంలో ఈ వ్యవహారం వైసీపీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
